: పన్నులు కట్టకుంటే ఎలా?: ప్రకాశం వాసులకు చంద్రబాబు క్లాస్
సరైన ఆదాయ వనరులు, నిధులు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలు కట్టే పన్నులే ఆదాయమని, అటువంటిది పన్నులు చెల్లించడంలో అలక్ష్యం వహిస్తే ఎలాగని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా ప్రజలకు క్లాస్ పీకారు. ఈ మధ్యాహ్నం జన్మభూమి - మా ఊరులో భాగంగా రాయవరంలో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం జిల్లా నుంచి పన్నుల రాబడి తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఏపీలో అత్యధిక భూభాగం ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ, నీటి కొరత పట్టి పీడిస్తున్నదన్న సంగతి తనకు తెలుసునని, నదుల అనుసంధానంతో నీటి సమస్యను తీరుస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే, జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు నీరందుతుందని అన్నారు. బడుగుల అభ్యున్నతికీ బీసీ ప్రణాళికను అమలు చేస్తామని, నిధులిచ్చి ప్రోత్సహిస్తామని అన్నారు. ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు.