: ఫ్యాన్స్ ను కోర్టుకీడ్చిన పాప్ గాయని డెల్ రే!
ఎంతటి వీరాభిమానులైనా నిత్యమూ ఇంటి ముందుకు చేరి గొడవ చేస్తూ, నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంటే ఏం చేస్తుంది మరి! వారిపై కోర్టుకు ఎక్కింది ప్రముఖ యూఎస్ పాప్ గాయని డెల్ రే. ఆమెను అభిమానించే ఇద్దరు రష్యన్ యువతులు చేస్తున్న గొడవను భరించలేక ఇంటిని మార్చినా, వారు కొత్త చిరునామా కనుక్కొని వచ్చి మరీ ఇబ్బంది పెడుతుండటంతో డెల్ రే ఫిర్యాదు చేసింది. నిత్యమూ వారు ఇంటిముందు బిగ్గరగా అరుస్తున్నారని, ముఖ్యంగా రాత్రుళ్లు నిద్రపట్టనీయడం లేదని వాపోయింది. తనకు ప్రాణహాని ఉందన్న భయాలున్నాయని తెలిపింది. విచారించిన కోర్టు సదరు యువతులను పిలిపించి, మరోసారి డెల్ ఇంటి సమీపానికి వెళ్లద్దని హెచ్చరించి పంపింది.