: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు సుప్రీంకోర్టులో ఊరట
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఇవాళ దాన్ని న్యాయస్థానం కొట్టి వేసింది.