: పాదాల పగుళ్లా?... ఇంట్లోనే సులువైన చికిత్సా విధానాలివిగో!


శీతాకాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యల్లో పాదాల పగుళ్లు ఒకటి. చలిగాలులు వీస్తున్న వేళ అరికాళ్లలో చర్మం చిట్లి బాధలు పడేవారెందరో. ముఖ్యంగా యువతుల్లో ఈ సమస్య అధికం. పగిలిన పాదాలకు సులువైన చికిత్సలను ఇంట్లోనే చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవి ఏంటంటే... క్యాండిల్ వాక్స్: కొవ్వొత్తి మైనాన్ని తీసుకుని, దాన్ని మస్టర్డ్ ఆయిల్ (ఆవాల నూనె)తో కలిపి పాదాలకు రాసి తెల్లవార్లూ వదిలేసి చూడండి. ఎంతో ఉపశమనం కనిపిస్తుంది. గ్లిజరిన్, రోజ్ వాటర్: ఇక గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి పాదాలకు రెండు వారాల పాటు రాస్తే, పగుళ్లన్నీ ఇట్టే మాయమైపోతాయి. సిసామే ఆయిల్: సిసామే ఆయిల్ (నువ్వుల నూనె)... సాధారణంగా దీపారాధనకు వాడే నువ్వుల నూనెను వాడి కూడా పాదాల పగుళ్ల నుంచి అద్భుత రీతిలో బయటపడొచ్చు. అరటిపండు గుజ్జు: అరటి పండును తీసుకుని మెత్తగా గుజ్జు చేసి, పాదాలకు రాసినా త్వరిత ఉపశమనం లభిస్తుంది. పసుపు, తులసి మిశ్రమం: తులసి ఆకులను తీసుకుని, దానికి కొంత పసుపు కలిపి మిశ్రమంగా చేసుకుని కొద్దిగా కర్పూరం, ఆలోవెరా జెల్ (కలబంద గుజ్జు) జోడించి పాదాలకు రాసినా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

  • Loading...

More Telugu News