: తస్మాత్ జాగ్రత్త... భారత సైనికులకు ఐబీ సూచనలివి!
సామాజిక మాధ్యమాల ద్వారా తమ అందాన్ని ఎరగా చూపి పరిచయాలు పెంచుకుని రహస్యాలు సేకరిస్తున్న ఉగ్ర లేడీలపై తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని నిఘా వర్గాలు సైన్యాన్ని హెచ్చరించాయి. ఇందుకోసం 10 పాయింట్లను వెల్లడించి, వీటిని పాటించడంలో అశ్రద్ధ చూపవద్దని కోరింది. సైనికులతో పాటు వారి కుటుంబ సభ్యులకూ సూచనలు చేసింది. అవి ఏంటంటే... * ఫేస్ బుక్, సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలు చూడవద్దు. * యూనిఫాంలో ఉన్న చిత్రాన్ని వాట్స్ యాప్ లేదా ఫేస్ బుక్ తదితరాల్లో ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టవద్దు. * సామాజిక మాధ్యమాల్లో వ్యాపార ప్రకటనలను క్లిక్ చేసి ప్రైజుల కోసం క్లయిములు పెట్టవద్దు. * ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారిక గుర్తింపును బయటపెట్టవద్దు. * ఏదైనా ఆయుధం ధరించిన ఫోటోలు అప్ లోడ్ చేయవద్దు. * ర్యాంకు, బెటాలియన్, ఎక్కడ పోస్టింగ్ తదితరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. * తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వస్ట్ వస్తే తిరస్కరించాలి. సైనికుల కుటుంబాల వారు, తమ వృత్తి లేదా భాగస్వాముల గురించిన వివరాలు ఎక్కడా పోస్ట్ చేయకూడదు. * ఏవైనా చిత్రాల్లో బ్యాక్ గ్రౌండ్ కూడా మిలటరీకి సంబంధం లేనిదై ఉండాలి. * కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలో సైన్యానికి సంబంధించిన ఏ సమాచారాన్నీ స్టోర్ చేసుకోవద్దు. ఈ నిబంధనలన్నింటినీ సైనికులు, సైన్యాధికారులు పాటించాలని నిఘా విభాగం కోరింది.