: ఎంపీ, ఎమ్మెల్యే గొడవతో సబ్ రిజిస్ట్రార్ కు గుండెపోటు!


వరంగల్ జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతల మధ్య గొడవ ఓ ప్రభుత్వ అధికారికి గుండెపోటు వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే, ఇవాళ నూతన రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభోత్సవంలో రభస జరిగింది. సోమవారం ప్రారంభం చేయవద్దని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ గట్టిగా వాదించారు. కానీ ఇవాళ ప్రారంభోత్సవం చేసి తీరాల్సిందేనని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టుబట్టారు. వారి ఘర్షణ తార స్థాయికి చేరడంతో అక్కడే ఉన్న సబ్ రిజస్ట్రార్ కు ఛాతినొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

  • Loading...

More Telugu News