: మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్ లాల్


తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఈ ఉదయం కర్నూలు జిల్లా మహానందిలోని నందీశ్వరుడిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు గుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం భన్వర్ లాల్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకామేశ్వరి దేవికి చీర బహుకరించారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News