: అమ్మాయిని ఎరగా వేసి... హత్యలు చేస్తున్న ముఠా!


ఓ అందమైన అమ్మాయిని చూపిస్తారు. ఆశ పెడతారు. బుట్టలో పడ్డారో... బెదిరింపులు మొదలవుతాయి. డబ్బు దోచుకుంటారు. ఎదురు తిరిగితే హత్య చేసి వెళ్లిపోతారు. ఇంకొకడిని చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయన్, సత్యా రామచంద్రన్ అనే జంటను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే వెల్లడైన సత్యమిది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గత నెల 22న శ్రీకాళహస్తిలో ఓ లాడ్జిలో రూమును అద్దెకు తీసుకున్నారు వీరు. ఆపై పక్క రూములోనే ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తిపై వీరి కన్ను పడింది. విజయన్ స్వయంగా శ్రీనివాస్ ను పరిచయం చేసుకుని సత్యను చూపించాడు. ఆమెను చూసిన శ్రీనివాస్ కూడా అంతే త్వరగా బుట్టలో పడ్డాడు. ఆపై శ్రీనివాస్ ను బెదిరించగా, లొంగలేదు. దీంతో హత్య చేసి పారిపోయారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు అప్పట్లో పెద్దగా ఆధారాలేవీ దొరకలేదు. తాజాగా, విజయన్, సత్యల అరెస్టుతో ఆ మిస్టరీ వీడింది. వీరితో పాటు సురేష్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడని, గతంలో వీరు చేసిన హత్యలపై దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News