: కృష్ణా జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు... కత్తులతో సర్పంచ్ వర్గం స్వైర విహారం


కృష్ణాజిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఎప్పటి నుంచో రెండు వర్గాల మధ్య కొనసాగుతూ వస్తున్న కక్షలు నిన్న రాత్రి భీకర దాడికి కారణమయ్యాయి. జిల్లాలోని గూడవల్లిలో నిన్న రాత్రి సర్పంచ్ సాంబశివరావు వర్గం కత్తులు, కర్రలు చేతబట్టి స్వైర విహారం చేసింది. తన ప్రత్యర్థి వర్గానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి ఇంటిపై సాంబశివరావు తన అనుచరులతో కలిసి మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో వెంకట్రావు వర్గానికి చెందిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఉన్నట్టుండి కత్తులు, కర్రలతో సర్పంచ్ వర్గం దాడికి దిగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేసి, మళ్లీ ఘర్షణలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News