: ‘చంద్రన్న’ గోధుమ పిండిలో తవుడు!... ఆగ్రహించిన చంద్రబాబు, విచారణకు ఆదేశం


సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు ‘చంద్రన్న కానుక’ను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే సదరు కానుక కింద ఎంపిక చేసిన సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. ఈ సరుకుల్లోని గోధుమ పిండిలో తవుడు వచ్చిందని విజయనగరం జిల్లాకు చెందిన బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం విజయవాడ నుంచి ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమంపై జిల్లా అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోధుమ పిండిలో తవుడు వచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు, దానిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News