: పెరుగుతున్న మృతులు - ఆసుపత్రులకు క్షతగాత్రులు


ఈ ఉదయం భారత్, మయన్మార్ సరిహద్దుల్లో వచ్చిన భూకంపం తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటివరకూ ఐదుగురు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించగా, పలు భవంతులు కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 40 మంది వరకూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. పలు ఆసుపత్రులు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ఇంఫాల్ లో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదేనని డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సభ్యుడు కనర్జిత్ కంగుజామ్ పేర్కొన్నారు. ఇంపాల్ కు పశ్చిమాన 29 కిలోమీటర్ల దూరంలో భూమిలో 57 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది.

  • Loading...

More Telugu News