: నక్కిన టెర్రరిస్టులు... కొనసాగుతున్న పఠాన్ కోట్ కౌంటర్ అటాక్
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఉగ్రవాదుల్లో నిన్న సాయంత్రానికే ఆరుగురు హతమయ్యారు. ఉగ్రవాదుల పనిబట్టే క్రమంలో ఏడుగురు భారత సైనికులు కూడా వీరమరణం పొందారు. శనివారం తెల్లవారుజామున పఠాన్ కోట్ లో మొదలైన కాల్పులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. విడతలవారీగా కొనసాగుతున్న కాల్పులతో పఠాన్ కోట్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. ఎయిర్ బేస్ లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆరుగురేనన్న వాదన కూడా తప్పని తేలిపోయింది. ఆరుగురు ఉగ్రవాదులు హతమైనా ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో దాక్కున్నారట. సమయం చూసి విరుచుకుపడేందుకు వారు యత్నిస్తున్నారు. అయితే ఎయిర్ బేస్ తో పాటు పరిసర ప్రాంతాలను కూడా జల్లెడపడుతున్న భారత సైనికులు ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నారు.