: ఐఎస్ సృష్టికర్తలు ఒబామా, హిల్లరీనే: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా, మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ విధానాల వల్లే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించిందని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. మిసిసిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ఒబామా, క్లింటన్ విధానాలపై ఆయన దుమ్మెత్తి పోశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇంతిలా వ్యాప్తి చెందడానికి వాళ్లిద్దరే బాధ్యత వహించాలన్నారు. కాగా, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అన్న నినాదంతో దూసుకుపోతున్నారు.