: ప్రేక్షకుల గుర్తింపు పొందే పాత్రలేవైనా సరే ఇష్టమే: వైఎస్ కృష్ణేశ్వరరావు


పాత్ర చిన్నదైనా, పెద్దదైనా ప్రేక్షకుల గుర్తింపు పొందే క్యారెక్టర్లు చేయడం ఇష్టమని ప్రముఖ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, దర్శకుడు వైఎస్ కృష్ణేశ్వరరావు అన్నారు. రంగస్థలం నుంచి తన కెరీర్ ప్రారంభమైందని చెప్పారు. పెద్ద వంశీ చిత్రాల్లో తాను ఎక్కువగా నటించానని చెప్పారు. 'గోపి.. గోపిక.. గోదావరి', 'సరదాగా కాసేపు' వంటి చిత్రాల్లో తనకు మంచి పాత్రలు లభించాయని అన్నారు. అంతేకాకుండా, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ కథలు' చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. గతంలో దర్శకుడు శంకర్ తీసిన 'భద్రాచలం', ఆర్.నారాయణమూర్తి చిత్రాలు 'ఎర్రసముద్రం', 'కూతురు కోసం' తదితర చిత్రాల్లో కూడా తనకు మంచి అవకాశాలు లభించాయన్నారు. ‘పాత చిత్రాలు బాగున్నాయి.. ఇప్పటి చిత్రాలు బాగుండలేదని సహజంగా అంటుంటారు కదా, దానిపై మీ అభిప్రాయమేమిటి?’ అని ఆయన్ని ప్రశ్నించగా... అది తప్పని.. ఇప్పటి కాలానికి అనుగుణంగా మనము లేకపోవడం, ఆ స్పీడ్ ను అందుకోలేకపోవడమే అందుకు కారణమని అన్నారు.

  • Loading...

More Telugu News