: ఎంఐఎం నుంచి కాంగ్రెస్ లోకి త్వరలో వలసలు: షబ్బీర్ అలీ
రెండు, మూడు రోజుల్లో ఎంఐఎం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో వలసలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పుకోవడంలో తాము వెనుకబడ్డామని అన్నారు.