: డబ్బింగ్ చెబుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నా: రకుల్ ప్రీతిసింగ్
డబ్బింగ్ చెప్పడాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని అందాలనటి రకుల్ ప్రీతిసింగ్ తెలిపింది. ఆమె ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలోని తన పాత్రకు డబ్బింగ్ చెబుతోంది. తాను డబ్బింగ్ చెబుతుండగా తీసుకున్న ఒక ఫొటోని ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. కాగా, 'నాన్నకు ప్రేమతో' చిత్ర నిర్మాణానంతర పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రకుల్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కోసం తారక్ అభిమానులు వేచిచూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ను నిర్వహించిన విషయం తెలిసిందే.