: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం చోటుచేసుకుంది. రైఫిల్ షూటింగ్ రేంజ్ ఆవరణలోని సెక్యూరిటీ సిబ్బంది గదిలో జింక మాంసం ఉందనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో అక్కడికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు జింక మాంసాన్ని స్వాధీనం చేసుకుని షూటింగ్ రేంజ్ కేర్ టేకర్ గోవిందరావుతో పాటు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ జింకను ఎవరు చంపారనే విషయం తెలియాల్సి ఉంది.