: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కూడా ప్రచారం చేస్తారు: మంత్రి తలసాని


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రేటర్ లో ఎవరితోను పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, గ్రేటర్ లోని 150 డివిజన్లలో తాము పోటీ చేస్తామని, 100 సీట్లలో గెలుపు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కృష్ణా ఫేజ్ 3, గోదావరి జలాల ద్వారా నీటి సమస్య తీర్చామని, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకుగాను మల్టీలెవెల్ ఫైఓవర్లు నిర్మిస్తున్నామని తలసాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News