: ముగిసిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం... ఎమ్మెల్యేలకు గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు
తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే లు సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, అందులో మన భాగస్వామ్యం ఉండాలంటే గ్రేటర్ లో గెలిచి తీరాలని అన్నారు. గ్రేటర్ లోని 150 డివిజన్లలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు.