: ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతాం: దత్తాత్రేయ


ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తాయని, ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతామని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. కేంద్ర సాయం లేనిదే రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు. ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News