: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆఫీసు వద్ద ఒకరి ఆత్మహత్యాయత్నం!


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యాలయం వద్ద ఆదివారం ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు కార్పొరేటర్ టిక్కెట్ ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ ముస్తాక్ షరీఫ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. దీంతో అక్కడ ఉన్నవారు అతన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే గోపీనాథ్ ను మీడియా ప్రశ్నించగా.. షరీష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వాడు కాదని చెప్పారు. సుమారు 15 రోజుల కిందట సదరు వ్యక్తి తనను కలిశాడని, టీడీపీలో చేరతానని అన్నాడని గోపీనాథ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News