: సీఎం చంద్రబాబు సమీప బంధువుకే రుణమాఫీ కాలేదు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమీప బంధువుకే రుణమాఫీ కాలేదు. దీంతో సదరు బంధువు అధికారులను నిలదీశారు. చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో ఆదివారం జన్మభూమి- మన ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారులు వచ్చారు. బాబు సమీప బంధువు నాగరాజు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తనకు రుణ మాఫీ కాలేదంటూ అధికారులను ఆయన నిలదీశారు. తనకు రూ.40 వేల అప్పు ఉంటే ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.