: కవలలే... కానీ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు!


ఒకే తల్లి గర్భంలో నవమాసాలుండి వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలల గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. శాన్ డియాగోకు చెందిన మారిబెల్ వెలెన్సియా నొప్పులతో ఆసుపత్రిలో చేరిన వేళ 2015 ఆఖరి నిమిషాల్లో ఓ పాప, ఆ తరువాత 2016 రెండో నిమిషంలో బాబు జన్మించారు. వీరికి జైలీన్, లూయిస్ అని పేర్లు పెట్టామని, ఆ సమయంలో తాను గడియారం చూస్తూ కాలం గడిపానని మిరిబెల్ భర్త ఆనందంగా చెబుతున్నాడు. ఇలా వేర్వేరు సంవత్సరాల్లో కవలలను కన్న జంటలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్న విషయమై వెతుకుతున్నామని తెలిపాడు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని ఎన్బీసీ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

  • Loading...

More Telugu News