: ఐటీ దాడుల వేళ, ప్లానేసి నగలను బయటకు పంపి ఆపై బుక్కయిన డాక్టర్!


తమ ఇంట్లో నగలు పోయాయని ముంబై పోలీసులకు వచ్చిన ఫిర్యాదును విచారించిన పోలీసులు విస్తుపోయే నిజం తెలిసింది. ఆ నిజం ఏంటన్న వివరాలు తెలుసుకోవాలంటే, రెండు వారాల క్రితం జరిగిన ఘటనలు తెలుసుకోవాలి. బాలీవుడ్ లో చాలా మంది తారలకు వైద్య సేవలందించే ఓ డాక్టర్ పై రెండు వారాల క్రితం ఐటీ శాఖ దాడులు జరిపింది. ఆ సమయంలో వారికి తినేందుకు డాక్టర్ భార్య పిజ్జాలు ఆర్డరిచ్చి తెప్పించారు. సోదాలకు వచ్చిన అధికారులు వాటిని లొట్టలేసుకుంటూ తిన్నారు కూడా. ఆపై పిజ్జా బాక్సులను చెత్తబుట్టలో వేయాలని చెప్పిన ఆమె, వాటి నిండా ఇంట్లోని రూ. 16 లక్షల విలువైన నగలను నింపి పనిమనిషి రామ్ చౌదరి చేతికి ఇచ్చింది. వాడు ఆ నగలను చక్కగా తీసుకుని చెక్కేశాడు. ఐటీ దాడులు ముగిసిన తరువాత, నగలు తీసుకెళ్లిన రామ్ తిరిగి రాకపోవడంతో డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. తమ ఇంట్లో పనిమనిషి వాటిని దొంగిలించి వుండవచ్చని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామ్ ను పట్టుకొచ్చి విచారిస్తే, మొత్తం విషయం బయటపడింది. దీంతో అవాక్కయిన పోలీసులు విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలిపారు.

  • Loading...

More Telugu News