: ఢిల్లీ ఆదర్శంగా బెంగళూరు ముందడుగు
ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఢిల్లీలో అమలు చేస్తున్న 'సరి-బేసి' విధానాన్ని బెంగళూరులో అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి జి పరమేశ్వర వెల్లడించారు. ఇక్కడి జేపీ నగర్ లో పోలీసు క్వార్టర్స్ ను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ప్రభుత్వం తన ఉత్తర్వులను ఎలా అమలు చేస్తున్నదో తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిపుణులు, వివిధ శాఖ అధికారులతో బెంగళూరులో కార్ల నియంత్రణపై చర్చిస్తున్నామని అన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ, వాయు, ధ్వని కాలుష్యాలు పెరిగిపోయాయని, దానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తామని అన్నారు. పోలీసు సంక్షేమంలో భాగంగా గృహ స్కీము కింద 11 వేల మందికి క్వార్టర్స్ ను నిర్మించి ఇవ్వనున్నామని తెలిపారు.