: ఏపీలో రేవంత్ రెడ్డి... తిరుపతికి వెళ్లిన టీటీడీపీ నేత


నిన్న హైదరాబాద్ లో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేసీఆర్ సర్కారుపై పెను విమర్శలు చేసిన తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, ఈ ఉదయం తిరుపతి చేరుకుని తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలదే విజయమని జోస్యం చెప్పారు. గతంలో సెటిలర్లపై తీవ్ర విమర్శలు చేసి, ఆపై ఇప్పుడు వారి ఓట్ల కోసం తెరాస వెంపర్లాడుతోందని, సెటిలర్లు ఎవరూ వారికి ఓట్లేసే పరిస్థితే లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బినామీ సర్వేలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. రేవంత్ కు స్వాగతం పలికిన టీటీడీ ప్రొటోకాల్ అధికారులు, ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.

  • Loading...

More Telugu News