: భార్య కోసం బరిలోకి దిగుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు!


2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలని భావిస్తున్న మాజీ ఫస్ట్ లేడీ హిల్లరీ క్లింటన్ తరఫున ప్రచారం చేసేందుకు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రంగంలోకి దిగనున్నారు. డెమోక్రాట్ల తరఫున పోటీ పడనున్న ఆమెకు భర్త నుంచి వచ్చే మద్దతు కీలకమవుతుందని నిపుణుల అంచనా. ఇప్పటికే రిపబ్లికన్ల తరఫున ముందున్న డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు క్లింటన్లపైనా పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో, వాటన్నింటికీ సమాధానం ఇవ్వాలని బిల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం నాడు న్యూ హాంప్ షైర్ పరిధిలోని పలు ర్యాలీల్లో పాల్గొనడం ద్వారా ఆయన తన ప్రచారాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఇటీవలి కాలంలో ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, ఆయన తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. బిల్ క్లింటన్ పదవిలో ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చిన సెక్స్ స్కాండల్, ఆరోపణలను మరోసారి ప్రజల ముందుంచుతున్నారు. వీటిపై బిల్ క్లింటన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News