: చేతిలో సెల్, చంకలో సంచీతో మోదీ వెంట పడ్డ యువకుడు... భద్రతాధికారులు ఆందోళన చెందిన వేళ!


చేతిలో ఓ సంచీతో ప్రధాని మోదీ వెళుతున్న కాన్వాయ్ కి సమాంతరంగా పరుగు పెడుతున్న ఓ వ్యక్తిని గమనించిన భద్రతాధికారులు ఆందోళన చెందారు. ఈ ఘటన మోదీ మైసూరు పర్యటనలో జరిగింది. రోడ్డుకు ఇరువైపులా అధిక సంఖ్యలో ప్రజలు మోదీకి అభివాదం పలుకుతున్న వేళ, వీవీ సర్కిల్ సమీపంలో 'మోదీ మోదీ' అని నినాదాలు చేస్తూ, ఓ వ్యక్తి కాన్వాయ్ లోకి జొరబడేందుకు యత్నించాడు. "ఓ వ్యక్తి మోదీ పేరును పలుకుతూ, పరుగులు పెట్టాడు. అతన్ని గమనించిన భద్రతాదళాలు అడ్డుకున్నాయి. స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతోంది" అని బెంగళూరు డీజీపీ ఓం ప్రకాష్ వివరించారు. అతని చేతిలో ఓ సంచీ ఉండటంతోనే కాన్వాయ్ అధికారులు కాస్త కంగారు పడ్డారని, అందులో ఏమీ అనుమానితాలు లేవని తెలిసిందని పేర్కొన్నారు. కాగా, వీడియో ఫుటేజ్ లో అతని చంకలో ఓ సంచీ, మరో చేతిలో సెల్ ఫోన్ ఉన్నట్టు కనిపిస్తోంది. మిగతా ప్రజలంతా ఫుట్ పాత్ పై నిలబడి ఉండగా, అతనొక్కడే కాన్వాయ్ వెంట పరుగు తీసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News