: ఉగ్రవాదులకు భద్రతా బలగాలు దీటైన సమాధానం చెప్పాయి: మోదీ
భారత్ ఎదుగుదల చూడలేని వారు పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడికి పాల్పడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మైసూర్ సమీపంలోని సత్తూరులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మఠం నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎయిర్ బేస్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు దీటుగా భద్రతా బలగాలు స్పందించాయని అన్నారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు, సైనికుల తెగువకు గర్విస్తున్నానని మోదీ తెలిపారు. కర్ణాటకలో రెండు రోజుల పర్యటనకు ప్రధాని వెళ్లారు. నేటి రాత్రి మైసూర్ లో బస చేయనున్న ప్రధాని, రేపు మైసూర్ యూనివర్సిటీలో జరగనున్న 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని ప్రారంభిస్తారు.