: సెక్రటేరియట్ ఎందుకు?...టీడీపీ భవన్ నుంచి పాలించండి: రోజా
ఆంధ్రప్రదేశ్ లో చీకటి పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీకటి పాలన చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జీవోలు జారీ చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రజాతీర్పును ప్రభుత్వం గౌరవించడం లేదని ఆమె మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల పేరిట జీవోలు జారీ చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ అభ్యర్థి పేరిట 2 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేశారని ఆమె తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ జీవో జారీ చేయడంలో నిబంధనలు పాటించారా? అని ఆమె నిలదీశారు. ఇలాంటి పాలన చేయాలనుకుంటే సెక్రటేరియట్ నుంచి కాకుండా టీడీపీ భవన్ నుంచి పాలన చేయాలని ఆమె స్పష్టం చేశారు.