: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది: నఖ్వీ
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. యూపీలోని బరేలీలో ఓ వేడుకకు హాజరైన ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నిజాయతీపరుడని ఆయన పేర్కొన్నారు. డీడీసీఏ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.