: గ్రేటర్ పరిధిలో నల్లా బిల్లు, కరెంటు బిల్లులు రద్దు
గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని కరెంటు, నల్లా బకాయిలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమైన కేబినెట్ భేటీ పలు నిర్ణయాలు తీసుకుంది. రెండు మూడు రోజుల్లో గ్రేటర్ ఎన్నికల ప్రకటన వెలువడనుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. సుమారు 40 అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు చర్చించారు. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పన్నులు, రాయితీలు, సౌకర్యాలు వంటి పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. దీంతో మరిన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.