: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలియం కంపెనీలు ధరలు తగ్గించిన 24 గంటలు కూడా ముగియక ముందే ప్రభుత్వం వినియోగదారులపై ధరలతో దాడి చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల పతనం ప్రపంచ మార్కెట్ లో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదలకు దోహదం చేస్తుండగా, భారత్ లో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గు మంటున్నాయి. పెట్రోలియం కంపెనీలు ధరలు తగ్గించగానే ప్రభుత్వాలు అంతకు రెండింతలు ఎక్సెజ్ సుంకం విధిస్తున్నాయి. తాజాగా పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్ పై రెండు రూపాయల ఎక్సైజ్ సుంకం పెంపు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి.