: జాకీ చాన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడోచ్...!: సోనూ సూద్
'జాకీచాన్ నాకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చాడోచ్' అంటూ ప్రముఖ నటుడు సోనూ సూద్ సంబరపడిపోతున్నాడు. జాకీ చాన్ అంటే అభిమానించని సినీ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. తాజాగా సోనూ సూద్ 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో జాకీ చాన్ తో కలిసి నటిస్తున్నాడు. దీంతో సోనూ సూద్ చైనాలోని అత్యుత్తమ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ దగ్గర ఈ సినిమా కోసం శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో జాకీకి, సోనూ సూద్ కి చక్కని స్నేహం కుదిరింది. తమ స్నేహానికి గుర్తుగా నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని జాకీ చాన్ సోనూ సూద్ కి తెల్లటి జాకెట్ ను బహూకరించాడు. దీంతో సోనూ సూద్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ సందర్భంగా ఆ జాకెట్ ధరించి, జాకీ చాన్ తో కలసి తీసుకున్న ఫోటోను సోనూసూద్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.