: మత గురువు సహా 47 మందిని ఉరితీసిన సౌదీ అరేబియా
సౌదీ అరేబియాలో మత గురువు సహా 47 మందికి నేడు ఉరిశిక్ష అమలు చేశారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నందున వారికి ఉరిశిక్ష అమలు చేసినట్టు సౌదీ అరేబియా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2003 నుంచి 2006 మధ్య కాలంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన, మద్దతిచ్చిన వారికి ఈ శిక్షను అమలు చేశామని ప్రకటించింది. 2015లో మొత్తం 158 మందికి ఉరి శిక్ష అమలు చేసినట్టు సౌదీ ప్రభుత్వం పేర్కొంది. కేవలం నవంబర్ లోనే 45 మంది విదేశీయులు సహా 63 మందికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరాకు సంబంధించి ఉరిశిక్షను అమలు చేసినట్టు వివరించింది. తాజాగా ఉరిశిక్షగు గురైన వారిలో మత గురువు షేక్ నిమిర్ అల్ నిమిర్ కూడా ఉన్నారని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.