: బంగ్లాదేశ్ దుర్ఘటనలో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారులోని సవార్ ప్రాంతంలో కూలిన ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవన సముదాయం దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 180 మందికి పైగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో గాయాలపాలైన వారున్నారు. శిధిలాల కింద ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు ముమ్మర సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.