: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి... ఎదురు కాల్పుల్లో ఇద్దరు హతం


పంజాబ్ లోని భారత రక్షణ శాఖ కీలక స్థావరం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నేటి తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా ఎయిర్ బేస్ వద్దకు చేరుకున్న ఉగ్రవాదులు అక్కడ బీభత్సం సృష్టించేందుకు యత్నించారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన భద్రతా దళాలు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం అక్కడ ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News