: సీపీఐ నేత నారాయణ స్టెప్పులేశారు!


నూతన సంవత్సరం సందర్భంగా సీపీఐ జాతీయ నేత నారాయణ స్టెప్పులేశారు. కొత్త ఏడాది సందర్భంగా శుక్రవారం సీపీఐ గ్రేటర్ హైదరాబాద్ విభాగం తరపున ఒక కార్యక్రమం నిర్వహించింది. హుస్సేన్ సాగర్ లో రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన ఖైరున్నిసా బోట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం డెక్ లో వస్తోన్న పాటకు నారాయణ స్టెప్పులేశారు. ఆయనతో పాటు తోటి నాయకులు కూడా జత కలిశారు. ఈ స్టెప్పులను చూసి మరో సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి చిరునవ్వులు చిందించి తన సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News