: ఇజ్రాయిల్ పబ్ లో కాల్పులు..ఇద్దరు మృతి


ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ పబ్ లో కాల్పులకు పాల్పడిన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఈరోజు మధ్యాహ్నం జరిగింది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. టెల్ అవీవ్ మున్సిపాలిటి అధికారుల సమాచారం మేరకు, ఈ సంఘటనకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా పబ్ యజమానులలో ఒకరైన దుది మాల్కా మాట్లాడుతూ, సాధారణ రంగులో ఉన్న ఒక వ్యక్తి ఎం16 గన్ తో వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు. అతను కాల్పులకు పాల్పడుతుంటే తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సందుల్లోకి పరిగెత్తి మరీ తలదాచుకున్నామని చెప్పారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News