: కాబూల్ లో పర్యాటక ప్రాంతంలో బాంబు పేలుడు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో విదేశీ పర్యాటకులు లక్ష్యంగా బాంబు పేలుడు సంభవించింది. భారీ విస్పోటనం జరిగిందని కాబూల్ వాసులు పేర్కొంటున్నారు. కాబూల్ లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ఖాలా-ఈ-ఫతుల్లా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లక్ష్యంగా ఈ పేలుడు జరిగిందని ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. భారీ శబ్దంతో సంభవించిన ఈ పేలుడులో భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, దీని నష్టంపై మరింత సమగ్ర సమాచారం అందాల్సి ఉంది.