: ఎన్నికల హామీలు గుర్తు చేస్తూ మోదీకి 3 పేజీల లేఖ రాసిన హజారే
ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే మూడు పేజీల లేఖ రాశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పిన ఆయన, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో కదలిక లేని వాటిపై ఆయనకు గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను మర్చిపోయే అవకాశం ఉందని చెప్పిన ఆయన, ఇప్పటి వరకు చాలా హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. అలాగే గతంలోని యూపీఏ ప్రభుత్వానికి తాజా ఎన్డీయే ప్రభుత్వానికి ఎలాంటి తేడా కనిపించడం లేదని ఆయన అన్నారు. లోక్ పాల్ బిల్లు, లోకాయుక్తలను సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆయన ప్రధానిని కోరారు.