: సెటిలర్లు ఉన్న చోట్ల వారికే సీట్లిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భావ సారూప్యమున్న పార్టీలతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కలిసి వచ్చే ప్రతి పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో కలుపుకుపోతామని ఆయన స్పష్టం చేశారు. సెటిలర్లు ఎక్కువ మంది ఉన్న చోట్ల వారికే అవకాశం ఇస్తామని ఆయన వెల్లడించారు. గ్రేటర్ లో పోటీ పడే సెటిలర్లకు సీట్లిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. గ్రేటర్ పరిధిలో ఈ నెల 3న సమావేశం నిర్వహిస్తామని, 4న కాంగ్రెస్ ఆశావహుల దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన వివరించారు. జనవరి 7 నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.