: ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగలు విద్యుత్ ఇవ్వాల్సిందే: అధికారులతో కేసీఆర్


ఏ విధంగానైనా సరే తెలంగాణలో వ్యవసాయానికి పగలు విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి 9 గంటల పాటు పగలు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖాధికారులు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏప్రిల్ నుంచి పగటి పూటనే విద్యుత్ ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు తెలిపారు.

  • Loading...

More Telugu News