: ఫైన్ వేశారని బైక్ ని కాల్చేశాడు


చిత్తుగా తాగి బండి నడుపుతున్న వాహనదారుడ్ని పోలీస్ కానిస్టేబుల్ ఆపి చెక్ చేసి ఫైన్ వేశాడని ఆగ్రహించిన వాహనదారు ఆ వాహనాన్ని తగులబెట్టిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...గత రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో థానే పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి బైక్ పై తూలుతూ రావడం గమనించి, అతనిని ఆపారు. తనిఖీలు చేసిన పోలీసులు అతనికి జరిమానా విధించారు. దీంతో మద్యం మత్తులో ఒళ్లు తెలియని ఆ వ్యక్తి, ఆగ్రహంతో తన బైక్ కు నిప్పంటించాడు. దీంతో అతని బైక్ తో పాటు మరో ఐదు బైకులు పాక్షికంగా తగులబడ్డాయి. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News