: విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్ అరెస్టు
మూడు రోజుల సోదాల అనంతరం విశాఖలోని మధురవాడకు చెందిన సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ అతని బ్యాంకు లాకర్ తెరిచిన పోలీసులు రూ.84 వేల విలువైన బంగారం, 6 వెండి గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా అనంద్ కుమార్ అక్రమాస్తులను రూ.2.7 కోట్లుగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్ లో వాటి విలువ రూ.25 కోట్లు ఉంటుందని సీబీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రార్ కు ల్యాండ్ మాఫియాతో సంబంధాలున్నాయని గుర్తించామని, ఆ దిశగా విచారణ చేస్తామని ఇప్పటికే అధికారులు తెలిపారు.