: డైరెక్టర్ శంకర్ స్టైలే వేరు! న్యూ ఇయర్ శుభాకాంక్షల్లోనూ క్రియేటివిటీ!
న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పడంలోనూ ‘రోబో’ డైరెక్టర్ తన క్రియేటివిటీ చూపించాడు. ప్రస్తుతం ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ను శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రోబో-2 సెట్స్ లో రజనీకాంత్ తో కలిసి సీరియస్ గా డిస్కస్ చేస్తున్న ఒక ఫొటోను శంకర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో పాటు, న్యూ ఇయర్ విషెస్ లో తన తాజా చిత్రం పేరు కలిసొచ్చేలా విషెస్ చెప్పారు. ఎలా అంటే... హ్యాపీ న్యూ ఇయర్ ‘2.0’16 అంటూ తన ఈ క్రియేటివ్ డైరెక్టర్ విష్ చేశారు.