: ఇండస్ట్రీలో నేను తప్ప వేరే మగాడు ఉన్నాడా?: 'డిక్టేటర్' బాలకృష్ణ


తాను తప్ప మొత్తం తెలుగు సినీ పరిశ్రమలో ధైర్యంగా అవుట్ డోర్ షూటింగ్ లో పాల్గొనే మగాడు వేరే ఎవడైనా ఉన్నాడా? అని ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రశ్నించారు. 'డిక్టేటర్' సినిమా విశేషాల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా అందమైన ఇన్ డోర్, అవుట్ డోర్ లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకుందని చెప్పారు. అవుట్ డోర్ షూటింగ్ లో ఎలాంటి బెరుకు లేకుండా పాల్గోవడం మొత్తం సినీ పరిశ్రమలో తనకు ఒక్కడికే చెల్లిందని బాలయ్య పేర్కొన్నారు. అలాంటి సాహసాలు చేస్తాను కనుకే అభిమానులు తనను ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. టెక్నీషియన్లు, సిబ్బంది 'డిక్టేటర్'ను ఉన్నతంగా తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. సంక్రాంతికి ఈ సినిమా నిజమైన పండుగను తెస్తుందని బాలయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తన సినిమాలు ఉంటాయని, ఏదో ఒక వర్గాన్ని మాత్రమే ఆకట్టుకోవడం తనకు నచ్చదని బాలయ్య అన్నారు. కథ, కధనం, మ్యూజిక్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, డాన్సు అన్నీ ఆకట్టుకుంటాయని బాలకృష్ణ తెలిపారు.

  • Loading...

More Telugu News