: ఏపీలో చేనేత కార్మికుల రుణవిముక్తికి విధివిధానాలు ఖరారు
చేనేత కార్మికుల రుణ విముక్తి అమలుపై ఏపీ ప్రభుత్వం విధివిధానాలు వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని కోసం పరిశ్రమల శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఆరుగురితో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిటీ ఆమోదించిన జాబితాను వారం రోజుల్లోగా పరిశీలించాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది.