: పైరసీ, గైరసీ జాన్తానై...అవన్నీ మనకు పడవు: బాలకృష్ణ
పైరసీలు, గైరసీలు జాన్తానై...అవన్నీ మనకు పడవు... అన్నారు ప్రముఖ నటుడు బాలకృష్ణ. 'డిక్టేటర్' సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, తమ సినిమాలను టీవీలు, సీడీల్లో చూస్తే పెద్ద మజా రాదని చెప్పారు. పెద్ద స్క్రీన్లలో చూస్తేనే తమ సినిమాలు మజానిస్తాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో స్టేజీలపైనా, సినిమాల్లోను తాను చెప్పే డైలాగుల నుంచి ఓ పాయింట్ పట్టుకుని, తన బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా రచయితలూ కథలు రాస్తారని బాలయ్య తెలిపారు. పవర్ ఫుల్ డైలాగులు వినాలంటే పెద్ద స్క్రీన్లే సరైనవని ఆయన చెప్పారు. కావాలంటే ఓ టీవీలో చూసిన సినిమా పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఆ వేరియేషన్ తెలుస్తుందని బాలయ్య పేర్కొన్నారు.