: ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అరెస్ట్


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అబ్బాస్ ను ముంబై ఏఈసీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఈ నెల 7వరకు పోలీస్ కస్టడీకి ఆదేశించారు. ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న మరో మాఫియా డాన్ ఛోటా రాజన్ ను జైల్లోనే చంపేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షకీల్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని కీలక అనుచరుడు అబ్బాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News